ప్రకాశం జిల్లా: ప్రకాశం జిల్లా టంగుటూరు టోల్ ప్లాజా వద్ద పోలీసు తనిఖీల్లో ఒక కారులో అక్రమంగా తరలిస్తున్న కిలో 250 గ్రాముల బంగారం, రూ.58 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ 90 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన మేడిశెట్టి మల్లేష్, అతని భార్య చంద్రకళ చెన్నై నుంచి బంగారాన్ని అక్రమంగా తీసుకువెళుతుండగా స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. సొత్తును పోలీసులు సీజ్ చేసి తదుపరి చర్యలు నిమిత్తం ఐటీ అధికారులకు అప్పగించారు.