ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
భువనగిరి, మహానాడు : గొల్లకుర్మగా నాకు మంత్రి పదవి ఇవ్వాలని సీఎం, డిప్యూటీ సీఎం, మిగతా మంత్రులను కలిసి తన అభిప్రాయాన్ని చెప్పినట్లు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… మంత్రి పదవి ఆశిస్తున్నట్లు నా అభిప్రాయాన్ని సీఎం రేవంత్ రెడ్డికి చెప్పాను. సీఎం సానుకూలంగా స్పందించారు.
నల్గొండ పార్లమెంట్ పరిధిలో ఇద్దరికి మంత్రి పదవులు వచ్చాయి. ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రులుగా ఉన్నారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఒక్కరు కూడా మంత్రులుగా లేరు. భువనగిరి పార్లమెంట్ పరిధిలో నాకు అవకాశం ఇవ్వాలని అడుగుతున్నా. గొల్లకుర్మలు లేకుండా ఎన్నడూ మంత్రి వర్గం లేదు.
రాష్ట్రవ్యాప్తంగా గొల్ల కుర్మలకు ప్రతినిధిగా మంత్రి వర్గంలో ప్రాతినిధ్యం కల్పించాలి. ఆంధ్రలో ముగ్గురికి మంత్రి వర్గంలో ఛాన్స్ ఇచ్చారు. ఇక్కడ కూడా మంత్రివర్గంలో చోటు కల్పించడంతోపాటు ఎమ్మెల్సీ, ఒక అడ్వైజర్ పోస్ట్, ఐదు కార్పొరేషన్లు, పీసీసీ చీఫ్ పోస్ట్, పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్, రెండు సీఎంపిఆర్ఓ పోస్టులు కేటాయించాలన్నారు. 50 లక్షల పై చిలుకు జనాభా ఉన్న గొల్లకుర్మలకు ప్రభుత్వంలో పదవులు ఇవ్వాలి.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవరు వచ్చిన పార్టీలో చేర్చుకుంటాం. విభజన అంశాలపై ఇద్దరు సీఎంలు చర్చించారు. కేంద్ర నిధులు కూడా వస్తున్నాయి. 53 శాతం ఓట్లు మావే పడ్డాయి. సీఎంపై నమ్మకం ఉంది. నాకు మంత్రి పదవి వస్తదని. కాంగ్రెస్ను ఆదుకున్నది గొల్లకుర్మలే అని ఆయన ఉద్ఘాటించారు.