పోలవరం, అమరావతికి మంచి రోజులు

-వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రాధాన్యత
-బడ్జెట్ లో రాష్ట్రానికి కేటాయింపులు శుభ పరిణామం
– రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

అమరావతి: కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపుల్లో రాష్ట్రానికి ప్రాధాన్యత ఇవ్వడం హర్షణీయమని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశు సంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి మరియు మత్స్య శాఖామాత్యులు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.

ఎన్డీఏ ప్రభుత్వంలో పోలవరం, అమరావతికి మంచి రోజులు వచ్చాయని, వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం, బడ్జెట్ లో రాష్ట్రానికి కేటాయింపులు శుభ పరిణామమని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.

రాష్ట్ర రైతాంగం కలల ప్రాజెక్టు పోలవరానికి ఆర్థిక తోడ్పాటు, నవ్యాంధ్ర రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్లు కేటాయించడం, వెనుకబడిన ప్రాంతాలకు – రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు కేటాయించడం పట్ల NDA ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి అచ్చెన్నాయుడు ధన్యవాదాలు తెలియజేశారు.

గడిచిన ఐదేళ్ల వైసీపీ విధ్వంస పాలన, ప్రజల సమస్యల నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు ఈ కేటాయింపులు ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు.