-ఎంత ఎదిగినా మూలాలు మర్చిపోకూడదు
-జిల్లాలోనే విద్యాహబ్‌గా నరసరావుపేట
-సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ
నరసరావుపేట, మహానాడు: సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ సోమవారం నరసరావుపేటలో పర్యటించారు. కేసానుపల్లి వద్ద ఢిల్లీ పబ్లిక్ స్కూలులో జ్యోతి ప్రజ్వలన చేసి చేసి వేడుకల్లో పాల్గొన్నారు. నరసరావుపేటకు ఢిల్లీ పబ్లిక్ ఇంటర్నేషనల్ స్కూల్ రావడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో చదువు అనేది చాలా ముఖ్యమని, స్కూల్ దశ అనేది మనకు ఎన్నో విద్యలు నేర్పిస్తుందని వ్యాఖ్యానించారు.
మనకి మంచి విద్య ఉంటే మనతో పాటు మరికొందరు బతుకుతారు… సమాజంలో మనం ఎలా ఉండాలి అనేది విద్యతోనే నేర్చుకుంటాం. స్కూలు దశ నుండే ప్రతి పిల్లాడికి మంచి అలవాట్లు నేర్పించాలి. సమాజంలో ప్రస్తుత అల వాట్లు చాలా వరకు మారాయి. ఇంగ్లీషుతో పాటు మాతృభాష తెలుగును మర్చి పోకూడదు. పల్నాడు ఎంతో చైతన్యం కలిగిన ప్రాంతం. రైతులు కష్టం చేసైనా తమ పిల్లలను మంచి స్కూలులో చదివించాలని కోరుకుంటారు. మనం జీవితం లో ఎంత ఉన్నత శిఖరాలకు వెళ్లినా మన మూలాలు ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకూడదన్నారు.
రాబోయే రోజుల్లో ప్రపంచంలో భారతదేశం అత్యంత శక్తివంతమైన దేశంగా మారబోతుందని, ప్రపంచంలో కెల్లా మనదేశంలో యువ త ఎక్కువ మంది ఉన్నారని తెలిపారు. నరసరావుపేటకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఒక మణిహారం కాబోతోంది. నరసరావుపేట జిల్లాలోనే విద్యా హబ్‌గా మారిందని ప్రశంసించారు.