-పదవిలో ఉన్నా లేకున్నా కలిసికట్టుగా పనిచేయాలి
-బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి
విజయవాడ: ప్రధాని మోదీ ఆధ్వర్యంలో భారతదేశం ఈ పది సంవత్సరాలలో ఐదవ ఆర్థిక శక్తిగా అవతరించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మోదీ ఆధ్వర్యంలోనే రానున్న కాలంలో మూడో ఆర్థిక శక్తిగా మారనుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లోనే 60 వేల కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణం చేపట్టింది. పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణం, మరుగు దొడ్లు నిర్మాణం జరిగిందని గుర్తు చేశారు. బీజేపీ సిద్ధాంతం ఒకటే… ముందు దేశం.. తరువాత పార్టీ..ఆ తరువాతే వ్యక్తి అని తెలిపారు. అధ్యక్షురాలిగా నేను ఉన్నా,. లేకపోయినా దేశం కోసం.. బీజేపీ కోసం మనందరం కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. బీజేపీలో ఎవరైతే కస్టపడి పనిచేస్తారో వారిని గుర్తించి అందరికి సమూచిత స్థానం కల్పిస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరాం, మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ, కిలారు దిలీప్ పాల్గొన్నారు.