Mahanaadu-Logo-PNG-Large

భారత్ కోసం గూగుల్ ప్రత్యేక డూడుల్

భారత స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా గూగుల్ తమ హోం పేజీని ప్రత్యేక డూడుల్తో అలంకరించింది. ఫ్రీలాన్స్ ఆర్ట్ డైరెక్టర్ వృందా జవేరీ దీన్ని రూపొందించారు.

దేశవ్యాప్తంగా ప్రజలు ఈ రోజు త్రివర్ణాలతో వేడుకలు చేసుకుంటారని, ఈ సందర్భంగా వారసత్వ నిర్మాణశైలిని ప్రతిబింబించేలా పలు వర్ణాలతో డూడుల్ని తీర్చిదిద్దామని గూగుల్ తెలిపింది. ప్రత్యేక సందర్భాల్లో గూగుల్ హోం పేజీలో డూడుల్ను ఏర్పాటు చేస్తుంటుంది.