అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి

అమరావతి: అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎంపికయ్యారు. అసెంబ్లీకి 7 సార్లు గెలుపొందారు. బుచ్చయ్యకు ఫోన్ చేసి ప్రోటెం స్పీకర్‌గా వ్యవహరించాలని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారు.
రేపు బుచ్చయ్యతో ప్రోటెం స్పీకర్‌గా గవర్నర్ ప్రమాణం చేయించే అవకాశం ఉంది. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఘన విజయం సాధించారు. 60 వేల పైచిలుకు మెజార్టీతో విక్టరీ కొట్టారు. 77 ఏళ్ల వయస్సులోనూ ఉత్సాహంగా ప్రజా సేవ చేస్తున్నారు. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఆపార్టీలో ఉన్నారు. ఎన్టీఆర్ తర్వాత చిన్న అన్నగా బుచ్చయ్య చౌదరిని తెలుగుదేశం శ్రేణులు పిలుస్తారు.