దర్శి, మహానాడు: తూర్పు వెంకటాపురం గ్రామంలో అనారోగ్యం తో బాధపడుతున్న పార్టీ కార్యకర్త అరేటి నాగేశ్వరరావుని పరామర్శించి వైద్య వివరాలూ తెలుసుకొని ఆర్ధిక సహాయం తెలుగుదేశం పార్టీ(టీడీపీ) దర్శి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అందించారు. సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ కడియాల లలిత్ సాగర్, ఎమ్మెల్సీ అశోక్ బాబు, ఒంగోలు పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ నూకసాని బాలాజీ, మాజీ ఎమ్మెల్యే నారాపుసెట్టి పాపారావు, దర్శి నగర పంచాయతీ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, గ్రామ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇదిలావుండగా, తూర్పు వెంకటాపురం సర్పంచ్ మారేడు శ్రీలక్ష్మి, పలువురు వైసీపీ నాయకులు గొట్టిపాటి లక్ష్మి ఆధ్వర్యంలో వైసీపీని వీడి టీడీపీలో చేరారు.