ప్రకాశం జిల్లా కలెక్టర్ ను కలిసిన గొట్టిపాటి లక్ష్మి

తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియాని మర్యాదపూర్వకంగా కలిశారు. ఒంగోలులోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి డాక్టర్ కడియాల లలిత్ సాగర్ లు భేటీ అయ్యారు. దర్శి నియోజకవర్గంలోని సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారధ్యంలో కూటమి ప్రజా ప్రభుత్వం ప్రజల కోసం తీసుకుంటున్న విప్లవాత్మకమైన నిర్ణయాలు పథకాలు ప్రజలు దరిచేర్చే విధంగా అధికారుల నుండి సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. దర్శి నియోజకవర్గంలో కొందరు అధికారుల పనితీరు వైసీపీ ప్రభుత్వంలో ఎలాంటి పనులు చేయకుండా బిల్లులు కోసం వైసీపీ నేతలు అడ్డదారుల్లో చేస్తున్న ప్రయత్నాలు, ఎన్నికల్లో వైసీపీ నేతలు దాడుల కేసులపై కూడా కలెక్టర్ తో సుదీర్ఘంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి చర్చించారు.

దర్శి అభివృద్ధి కోసం సంపూర్ణంగా సహకరించాలని ఆమె కలెక్టర్ ని కోరారు. దర్శి పట్టణంతోపాటు నియోజకవర్గంలోని గ్రామాలకు అవసరమైన తాగునీరు అందించేందుకు సాగర్ జలాలను మళ్లించాలని కోరారు నీటి ఎద్దడి అధికంగా ఉందని తెలిపారు. దీనివల్ల కలుషిత నీరు ప్రజలు అనారోగ్యానికి గురయ్యే పరిస్థితులు ఉన్నాయని తెలిపారు.

పారిశుద్ధ్యం మెరుగుదల దర్శి పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పన వంటివిధ అంశాలపై చర్చించారు. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ లో నియామకం, రేషన్ డీలర్లు నియామకం, ఖాళీగా ఉన్న రెవెన్యూ & మండల పరిషత్, ప్రభుత్వ వైద్యశాలల్లో పోస్టుల భర్తీలు వీఆర్వోలు నియామకాలపై సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ కి అందజేశారు. దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ వివరించారు.