కోటప్పకొండను దర్శించుకున్న గొట్టిపాటి లక్ష్మి

కూటమి విజయం కోసం మొక్కులు
సింగరకొండ ప్రసన్నాంజనేయ ఆలయంలో పూజలు

నరసరావుపేట: దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్‌ కడియాల లలిత్‌ సాగర్‌ దంపతులు సోమవారం ఉదయం కోటప్పకొండలోని త్రికోటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రం సర్వతోముఖాభి వృద్ధి సాధించేందుకు చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అఖండ విజయాన్ని సాధించాలని, దర్శి ప్రజల ఆకాంక్షలు తీరాలని ప్రార్ధించారు. వారి వెంట కడియాల రమేష్‌, కూటమి నేతలు, కుటుంబసభ్యులు, స్వగ్రామం యల మంద గ్రామ ప్రజలు ఉన్నారు. అనంతరం సింగరకొండలో ప్రసన్న ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.