ధరల నియంత్రణపై సర్కారు దృష్టి

– మంత్రులు లోకేష్‌, నారాయణ సమీక్ష

విజయవాడ, మహానాడు: వరద ముంపు ప్రాంతాల్లో అందుతున్న సహాయక చర్యలు, నిత్యావసర ధరల నియంత్రణపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ముంపు ప్రాంతాల్లో తాజా పరిస్థితి, సహాయక చర్యలు అందుతున్న తీరు, ధరల నియంత్రణపై మంత్రులు అధికారులతో సమావేశమై చర్చించారు. మంత్రులు నారా లోకేష్, పొంగూరు నారాయణ, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్‌, అధికారులు సీఎంవో, మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖ అధికారులు పాల్గొన్నారు.