ప్రతీ గ్రామాన్ని అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యం

– ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు

వల్లూరు, మహానాడు: గ్రామాలను అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని శాసన సభ్యుడు వేగుళ్ళ జోగేశ్వరరావు పేర్కొన్నారు. కపిలేశ్వరపురం మండలంలో కోరుమిల్లి, కపిలేశ్వరపురం, అచ్యుతాపురం, వల్లూరు గ్రామాలలో పల్లె పండగ వారోత్సవాలలో భాగంగా పలు అభివృద్ది పనులకు మండపేట నియోజకవర్గ జనసేనపార్టీ ఇన్ ఛార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ తో కలిసి ఎమ్మెల్యే వేగుళ్ళ భూమిపూజ చేశారు. తొలుత కోరుమిల్లి గ్రామంలో రూ. 60 లక్షలతో సి.సి రోడ్లు, డ్రైన్లు నిర్మాణానికి అలాగే కపిలేశ్వరపురం గ్రామంలో 44 లక్షలు, అచ్యుతాపురం గ్రామంలో 33 లక్షలు, వల్లూరు గ్రామంలో 12 లక్షలు రూపాయలతో సి.సి రోడ్లు, డైన్లు నిర్మాణం నకు భూమిపూజ నిర్వహించారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడా ఇటువంటి అభివృద్ధి జరగలేదని పేర్కొన్నారు. వేల కోట్లు అప్పులు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిది అయితే గ్రామాభివృద్ది కోసం నిధులు మంజూరు చేసిన ఘనత ముఖ్యంత్రి చంద్రబాబు నాయుడికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కి దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో కపిలేశ్వరపురం మండల కూటమి నాయకులు, కార్యకర్తలు, తదితర్లు పాల్గొన్నారు.