*భవిష్యత్తులో వరదనీరు ఇళ్లలో కి చేరకుండా చర్యలు
*సంగారెడ్డి రెవెన్యూ కాలనీ ,శ్రీ చక్ర కాలనీ లను సందర్శించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ
*వరద నీరు కాలనీలోకి రాకుండా చర్యలు చేసి తీసుకోవాలని నీటిపారుదల శాఖ, మున్సిపల్ శాఖ అధికారులకు ఆదేశం
సంగారెడ్డి: వర్షాల కారణంగా వరద నీరు ఇండ్లలోకి చేరిన సంగారెడ్డి పట్టణంలోని రెవెన్యూ కాలనీ, శ్రీ చక్ర కాలనీలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తో కలిసి సోమవారం ముంపు ప్రాంతాలను పరిశీలించారు.
పట్టణానికి అనుకొని ఉన్న ఎర్రకుంట చంద్రయ్య కుంటలలో వరద కాలువలు పూడుకపోవడం , అధిక వర్షాలు పడడం ఎర్రకుంట తూము చిన్నగా ఉండడం కారణంగా వరద నీరు బయటకు వెళ్లలేక రెవెన్యూ కాలనీ శ్రీ చక్ర కాలనీల లోకి వచ్చింది దీంతో రెండు కాలనీలలో సుమారు 130 ఇండ్లలోకి వరద నీరు వచ్చి చేరింది.
ఈ ప్రాంతాలను మంత్రి , మాజీ ఎమ్మెల్యేలు పరిశీలించారు. భవిష్యత్తులో ఇండ్లలోకి ఇలా వరద నీరు రాకుండా ఉండడం కోసం ఎర్రకుంట చంద్రయ్య కుంటల వరద కాలువలు పూడిక తీయడంతో పాటు తూములు వెడల్పు చేసి ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు చేపట్టాలని నీటిపారుదల శాఖ మున్సిపల్ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు.
ఈ సందర్భంగా కాలనీల ప్రజలతో మంత్రి మాట్లాడారు ప్రజలు అధైర్య పడద్దని ప్రభుత్వం ముంపు బాధితులకు అండగా ఉంటుందని భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా అవసరమైన అన్ని రకాల చర్యలు చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ నీటిపారుదల శాఖ అధికారులు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.