టీడీపీలోకి గ్రేస్‌ ఫౌండేషన్‌ అధినేత షాలేంరాజు

చంద్రబాబు సమక్షంలో చేరిక

పల్నాడు జిల్లా సత్తెనపల్లి, మహానాడు న్యూస్‌: బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం భట్టిప్రోలు మండలం పల్లెకోన గ్రామానికి చెందిన గ్రేస్‌ ఫౌండేషన్‌ అధినేత కైతేపల్లి షాలేంరాజు ఆదివారం టీడీపీలో చేరారు. సత్తెనపల్లిలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆధ్వర్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఆయనకు కండు వా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన గతంలో వైసీపీ, కాంగ్రెస్‌ పార్టీలలో కూడా పనిచేశారు.