పట్టభద్రుల ఎన్నికల ప్రచారం

– కరపత్రాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కన్నా

సత్తెనపల్లి, మహానాడు: పట్టణంలో పట్టభద్రుల ఎన్నికల ప్రచారం జరిగింది. ఈ కార్యక్రమంలో శాసన సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ పాల్గొని, ప్రతి ఒక్కరికి కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రైవేట్ హాస్పిటల్స్ డాక్టర్లలను కూడా కలిశారు. పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా ఓట్లు నమోదు చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో క నియోజకవర్గ పట్టభద్రుల ఎన్నికల కో ఆర్డినేటర్ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.