ఘనంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ జన్మదిన వేడుకలు

నరసరావుపేట, మహానాడు: నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కార్యాలయంలో అద్దంకి ఎమ్మెల్యే, విద్యుత్ శాఖ మంత్రి, పల్నాడు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ జన్మదిన వేడుకలు నరసరావుపేట నియోజకవర్గ కూటమి నేతలు కార్యకర్తల ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు కేక్ ను కట్ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకుడు, క్లస్టర్ ఇన్‌ఛార్జి వాసిరెడ్డి రవీంద్ర మాట్లాడుతూ గొట్టిపాటికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పార్టీలో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకున్నారు. అలాగే, వారి జీవిత కాలం ప్రజాసేవ చేసే భాగ్యం కల్పించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొని గొట్టిపాటి రవికుమార్ కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు.