గురజాల, మహానాడు: గురజాల నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు పుట్టినరోజు సందర్భంగా పిడుగురాళ్ల పట్టణం పిల్లుట్ల రోడ్డులోని నాగులగుడి దగ్గర ప్రత్యేక పూజల్లో యరపతినేని శ్రీనివాసరావు, యరపతినేని మహేష్, యరపతినేని నిఖిల్ పాల్గొన్నారు. అనంతరం పిడుగురాళ్ల పట్టణ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, జెడ్పీటీసీ జంగా వెంకట కోటయ్య పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేక్‌ను కూటమి నాయకులు కట్ చేశారు. ఈ సందర్బంగా నియో జకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి శుభాకాంక్షలు తెలిపారు.