ఆరోగ్యశ్రీ సేవలను ప్రారంభించిన శ్రీరాం రాజగోపాల్ తాతయ్య

జగ్గయ్యపేట : జగ్గయ్యపేట పట్టణంలో బస్టాండ్ వద్దగల స్మైల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ఆరోగ్యశ్రీ సేవలు మరియు E.H.S సేవలను జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ తాతయ్య చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హాస్పటల్ యాజమాన్యం డా: సందీప్, డా: వెంకట్, డా: అవినాష్, రిటైర్డ్ ఉద్యోగులు, హాస్పిటల్ సిబ్బంది, ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.