వారి పేరు నిలిపేలా రాజకీయాల్లో సంచలనాలు
ప్రజల మనిషిగా ఎదిగిన యువతేజం నారా లోకేష్
తాత నినాదం..నాన్న విధానం పుణికిపుచ్చుకున్న నేత
మంగళగిరి: ఎండైనా, వానైనా, చలైనా, వడగాలైనా 226 రోజుల పాటు 3132 కిలోమీటర్లు యువగళం పాదయాత్రతో పల్లెపల్లెకూ చేరారు నారా లోకేష్. ప్రజల మనిషిగా ఎదిగారు. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు కర్త, కర్మ, క్రియ అన్నీ అయిన కార్యకర్తల సంక్షేమమే లక్ష్యంగా కార్యకర్తల సంక్షేమ విభాగం బాధ్యతలు తీసుకుని నారా లోకేష్ తెలుగుదేశం పార్టీలో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా తనదైన శైలిలో పార్టీ బలోపేతానికి కృషి చేశారు. ఎమ్మెల్సీగా ఎన్నికై మంత్రి పదవి చేపట్టి మూడుశాఖలను ప్రగతిపథంలో పరుగులు పెట్టించారు. ప్రత్యక్ష రాజకీయాల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి 2019లో పోటీ చేసి 5 వేలు పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఓడిపోయినా నియోజకవర్గాన్ని వీడిపోలేదు..ఓడిన చోటే గెలవాలనే పట్టుదలతో పనిచేశారు. మంగళగిరి నియోజకవర్గంలో ప్రజలకు చేరువై సొంత నిధులతో 29 సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ప్రజల హృదయాలే కాదు…నియోజకవర్గంలో కూడా అత్యధిక మెజార్టీతో గెలిచి చరిత్ర సృష్టించారు. సమాజమనే దేవాలయంలో ప్రజలే దేవుళ్లు అనే తాత నినాదం, నాన్న విధానం పుణికిపుచ్చుకున్న నారా లోకేష్ తెలుగుదేశం పార్టీని మరో 30 ఏళ్ల పాటు తిరుగులేని ప్రజాశక్తిగా నడిపించగల దమ్ము ధైర్యం ఉన్న నేత అని నిరూపించుకున్నారు.
బాల్యం..చదువు…
నారా చంద్రబాబునాయుడు, భువనేశ్వరి దంపతులకు 1983 జనవరి 23న జన్మించారు. నాన్నది నారావారిపల్లె. అమ్మది నిమ్మకూరు. బాల్యమంతా హైదరా బాద్లోనే గడిచింది. భారతీయ విద్యాభవన్స్ పబ్లిక్ స్కూల్, విద్యాశ్రమ్లో ప్రాథమి క విద్యాభ్యాసం పూర్తిచేశారు. ఇంటర్మీడియట్ లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజీ, హైదరాబాద్‌లో పూర్తిచేశారు. అమెరికాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చేశారు. అక్కడే కార్నెగీ మెలన్ వర్సిటీలో బీఎస్సీ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ డిగ్రీ పొందారు. హెరిటేజ్ ఫుడ్స్ వైస్ ప్రెసిడెంట్‌గా, హెరిటేజ్ ఫిన్‌లీజ్ లిమిటెడ్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేశారు. వరల్డ్ బ్యాంకు మద్దతుతో వివిధ దేశా లలో అమలయ్యే కెపాసిటీ బిల్డింగ్ ప్రాజెక్ట్స్, ఈ గవర్నెన్స్, కనెక్టివిటీ సొల్యూషన్స్ అంశాలలో ప్రాజెక్టు మేనేజర్‌గా(2004-2006) పనిచేసిన నారా లోకేష్ స్వదేశాని కి చేరుకున్నారు.
రాజకీయ ప్రవేశం
2013లో పూర్తిస్థాయి రాజకీయరంగ ప్రవేశం చేసి 2014లో టీడీపీ అధికారం లోకి రావడంలో కీలకపాత్ర వహించారు. 2024లో టీడీపీ కూటమి అధికారం లోకి రావడంలో నారా లోకేష్ పోషించిన పాత్ర ఎనలేనిది. మంగళగిరి నియోజ కవర్గం ఎమ్మెల్యేగా ఎన్నికై 39 ఏళ్లుగా అందని నియోజకవర్గంపై టీడీపీ జెండా ఎగురవేశారు. టీడీపీ సభ్యత్వాల ద్వారా ప్రమాదబీమా, కార్యకర్తల సంక్షేమనిధి ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా విద్య, వైద్యసేవలు అందిస్తున్నారు. టీడీపీ నాయకత్వ శిక్షణ శిబిరాల ద్వారా 25 వేల మంది యువ నాయకులను తయారు చేసిన కార్యక్రమ రూపకర్త కూడా నారా లోకేషే కావడం గమనార్హం. 2015లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియామకమయ్యారు. 2018లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2018లో ఐటీ-ఎలక్ట్రానిక్స్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
మంత్రిగా అవార్డులు
30 ఏళ్ల వయసులోనే ముఖ్యమైన మూడు శాఖల మంత్రిగా నారా లోకేష్ చేసిన కృషికి జాతీయ, అంతర్జాతీయ, స్కోచ్ అవార్డులు దక్కాయి. ఏ పొలిటికల్ అనే సంస్థ ప్రకటించిన జాబితాలో ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన యువ నాయకుల్లో మొదటి 20 స్థానాల్లో నిలిచిన ఏకైక భారతీయుడు నాటి ఏపీ మంత్రి నారా లోకేష్. ప్రభుత్వ కార్యక్రమాల అమలులో వినూత్న ఆలోచనలు, పాలనలో టెక్నాలజీ వినియోగం, ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించడంపై నారా లోకేష్‌కు సింగపూర్ ఫారెన్ ఎఫైర్స్ మినిస్ట్రీ ఎస్ఆర్ నాథన్ ఫెలోషిప్ ప్రకటిం చింది. ప్రజల కోసం, రాష్ట్ర ప్రగతి కోసం అహరహం శ్రమిస్తున్న తెలుగుదేశం పార్టీ యువతేజం నారా లోకేష్…స్వచ్చ Ûరాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ అన డంలో ఎటువంటి సందేహం లేదు. అభివృద్ధి, సంక్షేమం, ఉపాధి కల్పన, విద్య, వైద్య, మౌలిక, పారిశ్రామిక, వ్యవసాయ రంగాలపై స్పష్టమైన విజన్‌తో ఉన్న నారా లోకేష్…తాతకు తగ్గ మనవడు, తండ్రిని మించే తనయుడుగా ప్రజల మన్ననలు అందుకుంటున్నారు.