భారీగా జనసేన సభ్యత్వాలు చేయించిన వాలంటీర్లకు ఘన సత్కారం

గుంటూరు, మహానాడు: జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాలు ఉమ్మడి గుంటూరు జిల్లాలో లక్షకు పైగా చేయడం, ఉమ్మడి గుంటూరు జిల్లాలో 500 కు పైగా సభ్యత్వాలు చేసిన వాలంటరీలకు, వీర మహిళలలో ఎక్కువ శాతం సభ్యత్వాలు చేయించిన కొందరికి ఘనంగా సత్కరించారు. అనంతరం వారికి మెమొంటోలు అందజేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ 1000 కి పైగా సభ్యత్వాలు చేయించిన వాలంటరీలకు చిరు సత్కారం చేశారు. విజయ్ శేఖర్, పాకనాటి రమాదేవి, ప్రచార కమిటీ కో ఆర్డినేటర్ శిఖా బాలు, కొప్పుల కిరణ్ బాబు, కార్పొరేటర్ యర్రంశెట్టి పద్మావతి, బిట్రగుంట మల్లికా, చట్టాల త్రినాథ్, ఊస రాజేష్, తోట రాజారమేష్, ఎస్‌కే కరిముల్లా, నాయకులు కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు.