మహనీయుడు వాల్మీకి మహర్షి

– టీడీపీ కేంద్ర కార్యాలయంలో నేతల ఘన నివాళి

మంగళగిరి, మహానాడు: యువగళం పాదయాత్రలో రాష్ట్ర మంత్రి నారాలోకేష్ ఇచ్చిన హామిని నిలబెట్టుకుంటూ.. నేడు వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా జరుపుకుంటున్నాం. వాల్మీకి అందించిన మదుర కావ్యాన్ని నిరంతరం స్మరిస్తూ… అవతారమూర్తి అయిన శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకుని ప్రజలు సన్మార్గంలో నడిచేందుకు భారతావనితో పాటు ప్రపంచ జనులకు అందించిన మహోన్నత గ్రంథమే రామాయణం. సర్వమానవుల క్షేమం కోసం పురుషోత్తముడైన శ్రీరాముడి చరిత్రను, ఉన్నతమైన ఆదర్శాలను మానవులకు అందించిన మహనీయుడు వాల్మీకి మహర్షి అని పలువురు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా గురువారం మంగళగిరి తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కేంద్ర కార్యాలయంలో ఆ ఆదికవి చిత్రపటానికి పలువురు నేతలు పూల దండలు వేసి స్మరించుకున్నారు. వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు. వాల్మీకి రచించిన ఆదర్శ, అనుచరనీయ, ధర్మబద్ధమైన రామాయణాన్ని ప్రతిఒక్కరు పటించి సన్మార్గంలో నడవాలని నేతలు కోరారు. హోంమంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, సీనియర్ నాయకులు రమణ, తెలుగు రైతు అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, తెలుగు యువత అధ్యక్షులు శ్రీ రామ్ చిన్నబాబు, డూండి రాకేష్ , ములక సత్యవాణి, మీడియా కో ఆర్డినేటర్ ధారపనేని నరేంద్రబాబు, తదితరులు పాల్గొన్నారు.