గుడివాడ గడ్డం గ్యాంగ్.. నీలి చిత్రాలు!

– నిందితుడి వెనుక వైసీపీ నేత కొడాలి నాని అండ?
– గుడ్లవల్లేరు ఇంజినీరింగ్‌ కాలేజీ ఘటన వెనుక విస్తుపోయే నిజాలు
(రమణ, మచిలీపట్నం)

గుడ్లవల్లేరు ఇంజినీరింగ్‌ కాలేజీలోని గర్ల్స్ హాస్టల్ లో హిడెన్‌ కెమెరాలు పెట్టి, వీడియోలు తీస్తున్న ఘటన 2022 నుంచి ఉందన్న విమర్శలు ఉన్నాయి. అది నేడు వెలుగులోకి వచ్చింది. రెండేళ్ళుగా దాదాపుగా 300 పైన వీడియోలు తీసినట్టు తెలుస్తోంది. గర్ల్స్ హాస్టల్ లో కెమెరాలు పెట్టించిన విద్యార్థిని విజయ్ గా గుర్తించారు. అతను వైసీపీ నేత కొడాలి నాని అనుచరుడి కొడుకు అని తేలింది. గర్ల్స్ హాస్టల్ లో ఉంటున్న ఒక విద్యార్ధిని సాయంతో హిడెన్ కెమెరాలు పెట్టించి, బాయిస్ హాస్టల్ లో ఉంటున్న విజయ్ ఆ వీడియోలు తీసినట్టు తెలుస్తుంది. నా వెనుక కొడాలి నాని ఉన్నాడు, గెడ్డం గ్యాంగ్ ఉంది, ఏమైనా చేస్తా అంటూ, విజయ్ తరుచు బెదిరిస్తూ ఉండే వాడని తోటి విద్యార్ధులు చెప్తున్నారు. కొడాలి నాని అనుచరుల దారుణాలు బయట పడటంతో, విద్యార్ధులు ఆందోళనకు దిగారు. నిన్న ముంబై హీరోయిన్ ఘటన, నేడు గుడ్లవల్లేరు ఇంజినీరింగ్‌ కాలేజీ ఘటన చూసి నాడు జగన్ రెడ్డి ప్రభుత్వం మహిళలను దారుణంగా వేధించిందని దేశం మొత్తం విస్తుపోతోంది. కాగా, ఈ విషయం పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొడాలి నాని పాత్ర పై కూడా ఆరా తీస్తున్నారు. కొడాలి నాని పారిపోవటం వెనుక ఈ కేసు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.