గుంటూరు, మహానాడు: గుంటూరు నగర వాసులకు ఆహ్లాదాన్ని పంచే పార్కులను పరిశుభ్రంగా ఉంచి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవి అధికారులను ఆదేశించారు. పార్కును పరిశీలించి పార్కు పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పార్కులో సమస్యలను ఎమ్మెల్యే గళ్ళా మాధవి దృష్టికి తీసుకొనివచ్చారు. ప్రధానంగా పార్కులో విధ్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ఉండటం వలన అది ప్రమాదకరంగా ఉందని, దాన్ని పార్కు బయట ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే గళ్ళా మాధవిని కోరారు. ఈ విషయం పై గళ్ళా మాధవి స్పందిస్తూ… విధ్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే గళ్ళా మాధవి హామీనిచ్చారు.