గంజాయి, మత్తు పదార్థాల హబ్‌గా గుంటూరు

కట్టడిలో పోలీసుల వైఫల్యం
వెనుక ఉండి నడిపిస్తున్నదెవరో తేల్చాలి
తెలుగుయువత జిల్లా అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ

గుంటూరు, మహానాడు: వైసీపీ హయాంలో గంజాయి మత్తుపదార్థాలకు హబ్‌గా గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని ముస్తఫా మార్చేశారని గుంటూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అధికార పార్టీ అండదం డలతో సాగుతున్న వ్యవహారాన్ని కట్టడి చేయటంలో పోలీసుల వైఫల్యం చెందారని విమర్శించారు. తెలుగుయువత ఆధ్వర్యంలో గుంటూరు తూర్పు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గంజాయి, మత్తు పదార్థాలను పోలీసులు ఎందుకు కట్టడి చేయలేక పోతున్నారో తూర్పు ప్రజానీకానికి సమాధానం చెప్పాల్సిన అవసరముందన్నారు. వెనుక ఎవరి అండదండలు ఉన్నాయో నిగ్గు తేల్చాలని, ముస్తఫాకు చిత్తశుద్ధి ఉంటే గంజాయి డీలర్లు, స్మగ్లర్లు ఎవరో గుర్తించి నార్కోటిక్‌ కేసులు పెట్టి నగర బహిష్కరణ చేయాలని, లేకుంటే ప్రజలు ఓటు రూపంలో బుద్ధి చెప్తారని హెచ్చ రించారు.

2021లో దేశవ్యాప్తంగా 7.50 లక్షల కిలోల గంజాయి పట్టుబడితే అందులో రెండు లక్షల కిలోలు ఒక్క మన రాష్ట్రం నుండే దొరకడం నిజం కాదా అని ప్రశ్నించారు. మత్తు పదార్థాలకు బానిసలై ఒక్క 2021 సంవత్సరంలోనే 571 మంది మన రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్నట్లు ఎన్సీఆర్బీ నివేదిక వెల్లడిర చిందన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ తెలుగుయువత అధ్యక్షుడు షేక్‌ అఫ్రోజ్‌ మాట్లాడుతూ మన రాష్ట్రం నుంచి దేశం మొత్తానికి గంజాయి సరఫరా అవుతుందని, ఉత్తరప్రదేశ్‌, ఢల్లీి, పంజాబ్‌, బెంగళూరు, కేరళ సహా పలు ప్రాంతా ల్లో పట్టుబడిన గంజాయి మన రాష్ట్రం నుంచి వెళ్లినట్లు అక్కడ పోలీసులు తెలప డం నిజం కాదా అని ప్రశ్నించారు. ఒక్క గంజాయి కాదు హెరాయిన్‌, కొకైన్‌ వంటి భయంకర మత్తు పదార్థాలు మాఫియా మన రాష్ట్రం లో దొరకడం విచారకరం అని విమర్శించారు. ఉత్తరాంధ్రని మత్తు పదార్థాల డెన్‌గా మార్చిన విజయసాయిరెడ్డి, స్థానిక నాయకుల అక్రమ సంపాదన నిజం కాదా అని ప్రశ్నించారు.

చివరకు ఏపీ నుంచి గంజాయి మత్తు పదార్థాలు కొరియర్‌, ఆన్‌ లైన్‌ షాపింగ్‌ ద్వారా విదేశాలకు రవాణా అబద్ధం నిజం కాదా అని ప్రశ్నించారు. సమావేశంలో గుంటూరు జిల్లా తెలుగుయువత ప్రధాన కార్యదర్శి షేక్‌ నాగుల్‌ మీరా బాబు, గుంటూరు తూర్పు ప్రధాన కార్యదర్శి మస్తాన్‌ రావణ్‌, ఉపాధ్యక్షులు కొండపి శేఖర్‌, కార్యనిర్వాహక కార్యదర్శి మన్నెం శ్రీనివాసరావు, తూర్పు నిరయోజకవర్గ ఉపాధ్యక్షుడు ఉప్పుటూరి వెంకటేష్‌, రేఖ పవన్‌, కార్యదర్శి దొడ్ల రాజేష్‌, కంచర్ల వెంకటేష్‌, అదిల్‌, ఫరీద్‌, ఖాజా, వేణు పాల్గొన్నారు.