గుంటూరు వైసీపీ కార్యాలయంపై రాళ్ల దాడి

గుంటూరు: నగరంలోని వైసీపీ కార్యాలయంపై టీడీపీ కార్యకర్తలు రాళ్లు విసిరారు. దాంతో అద్దాలు పగిలాయి. అనంతరం విడుదల రజనికి, వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. పరిస్థితి చెయ్యి దాటుతుండటంతో పోలీసులు స్వల్ప లాఠీచార్జ్‌ చేసి చెదరగొట్టారు. విడుదల రజిని కార్యాలయం చుట్టుపక్కల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గుంటూరు ఈస్ట్‌ సబ్‌ డివిజన్‌ ఎసీపీ నచికేట్‌ షెల్క్‌ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.