-త్వరలోనే కరవు నివారణ ప్రాజెక్టు పూర్తి, పచ్చని పల్నాడు స్వప్నం సాకారం
-వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు
కరవు నివారణ ప్రాజెక్టుకు తండ్రి పేరు పెట్టుకుని మరీ పల్నాడును ఎండబెట్టిన ఘనుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అని ధ్వజమెత్తారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. తెలుగుదేశం పార్టీ గత ప్రభుత్వం హయాంలోనే ప్రారంభించిన ప్రాజెక్టుకు కనీసం రూపాయి కూడా ఇవ్వకుండా, కిలోమీటర్ పని కూడా ముందుకు తీసుకుని వెళ్లకుండా ప్రాజెక్టును నిర్వీర్యం చేశారని మండిపడ్డారాయన.
ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని కీలకమైన సాగునీటి ప్రాజెక్టులన్నింటికీ పాతపేర్లు పునరుద్ధరిస్తూ, పల్నాడు కరవు నివారణ ప్రాజె క్టుకు వైఎస్ పేరును తొలగించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా స్వాగిస్తున్నామన్నారు జీవీ. అత్యంత వెనకబాటుకు చిరునామాగా ఉన్న పల్నాడు ప్రాంతంలో 4 జిల్లాల రైతులకు నీళ్లిచ్చే ఈ పథకానికి ఐదేళ్లు మోకాలడ్డారని… తండ్రి పేరు పెట్టుకుని కూడా పైసా పని చేయని వ్యక్తి జగన్ అని దుయ్యబట్టారాయన. పల్నాడు కరవు కష్టాలు తీర్చడానికి నదుల అనుసంధాన ం ఒక్కటే మార్గమని, అందులో పెన్నా- గోదావరి లింకింగ్ కీలకమని మొదట గుర్తించింది.
ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించింది ముఖ్యమంత్రి చంద్రబాబే అన్నారు జీవీ. ఆ దిశగానే గత ప్రభుత్వంలోనే అన్ని ఏర్పాట్లు చేసి, కాంట్రాక్టర్లను నియమించి పనులు ప్రారంభించినా వాటిని మూలకు చేర్చిన వ్యక్తి జగన్ అన్నారు. తర్వాత పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా జగన్ రెడ్డి వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు మళ్లీ పల్నాడు కరవు నివారణ ప్రాజెక్టుపై దృష్టి సారించడం సంతోషం కలగిస్తోందని, త్వరలోనే కరవు నివారణ ప్రాజెక్టు పూర్తి, పచ్చనిపల్నాడు స్వప్నం సాకారం అవుతోందనే నమ్మకం కలుగుతోంద న్నారు జీవీ. పల్నాడును కృష్ణా, గోదావరి జలాలతో సుభిక్షం చేయాలనే చంద్రబాబు సంకల్పం అని అందుకు అనుగుణంగా యుద్ధప్రాతిపదికన పల్నాడు కరవు నివారణ ప్రాజెక్టును పూర్తి చేస్తామని తెలిపారు జీవీ ఆంజనేయులు.