Mahanaadu-Logo-PNG-Large

అక్కచెల్లెళ్లకు రాఖీ పండుగ శుభాకాంక్షలు

  • ఆడబిడ్డల ఆత్మగౌరవం, భద్రత, అభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
  • ముఖ్యమంత్రి నారా చంద్రబాబు

నా ప్రియమైన తెలుగింటి ఆడపడుచులకు, అనునిత్యం ఆశీస్సులు కురిపించే అక్కచెల్లెళ్లకు రాఖీ పండుగ శుభాకాంక్షలు. తెలుగుదేశం పార్టీ ఆది నుంచి ఆడపడుచుల పక్షపాతి. మహిళలకు ఆస్తిలో సమాన హక్కులు కల్పించడమే కాకుండా ప్రభుత్వపరంగా ఇచ్చే పథకాలను, ఆస్తులను మహిళామతల్లుల పేరు పైనే ఇచ్చే సంస్కరణ తెచ్చింది కూడా తెలుగుదేశమే. మహిళా సాధికారత కోసం ‘డ్వాక్రా’ సంఘాలు, బాలికా విద్యకు ప్రోత్సాహం, స్థానిక సంస్థలలో మహిళలకు రిజర్వేషన్లు వంటి విప్లవాత్మక నిర్ణయాలతో మహిళా సంక్షేమం కోసం కృషిచేశాం. ఆడబిడ్డల ఆత్మగౌరవం, భద్రత, అభివృద్దికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటిస్తూ… ఈ ‘రక్షాబంధన్’ సమయంలో మరోసారి శుభాకాంక్షలు తెలుపుతూ మీకు అన్నివేళలా, అన్నివిధాల అండగా ఉంటానని హామీ ఇస్తున్నాను.