గుంటూరు, మహానాడు: సమాజంలో జాతీయ భావాల్ని పెంపొందించే దిశగా భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో గురువారం స్థానిక గుంటూరు హిందూ కాలేజ్ సెంటర్ వద్ద గాంధీ విగ్రహాన్ని శుభ్రం చేసి పూలమాల వేసి అక్కడ నుంచి హర్ ఘర్ తిరంగ ర్యాలీ ప్రారంభమైంది.
యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి తుంగ యశ్వంత్ ఆధ్వర్యంలో జాతీయ జండా లతో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ జరిపారు. బీజేపీ సీనియర్ నాయకుడు జూపూడి రంగరాజు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ముఖ్య అతిథిగా తూర్పు శాసనసభ్యుడు నసీర్ అహ్మద్ పాల్గొని, మాట్లాడుతూ యువత దేశభక్తి భావాలను పెంపొందించుకొని నవ సమాజం కోసం అడుగులు వేయాలని కోరారు.
అందరూ ఒక్క మాటకై నిలబడాలని, కొంతమంది స్వార్థపరులు తమ స్వార్థం కోసం తీసుకునే నిర్ణయాలను తిప్పి కొట్టాలని, యువత ఎప్పటికప్పుడు మంచి ఏది చెడు అనే విషయాన్ని తెలుసుకొని జన్మనిచ్చిన తల్లిదండ్రులకే కాకుండా ఈ దేశం కోసం మంచి పేరు ప్రతిష్ఠలు తెచ్చే విధంగా ఎదగాలని అన్నారు. జూపూడి రంగరాజు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా దేశ మంతా జాతీయ జెండాను ప్రతి ఇంటి పైన ఆవిష్కరించుకోవాలన్నారు.
జిల్లా అధ్యక్షుడు వనమా నరేంద్ర కుమార్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుమేరకు యావత్ భారతదేశం అంతా స్వాతంత్ర దినోత్సవాలను ఒక పండగలా చేస్తున్నారని, ధనిక, పేద, సంపన్న వర్గం తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తమ ఇంటి పైన ఆఫీసులపైన జాతీయ జెండాలను ఎగర వేస్తున్నారని తెలిపారు.
జోనల్ ఇంచార్జ్ ముని సుబ్రహ్మణ్యం, జిల్లా హర్ ఘర్ తిరంగా కన్వీనర్ చరక కుమార్ గౌడ్, కో – కన్వీనర్స్ ఆవుల రాము, ఏలూరి లక్ష్మి, బీజేవైఎం నాయకులు బాల కోటయ్య, ఈశ్వర్, రాజా సాయి, బిజెపి నాయకులు ఈదర శ్రీనివాసరెడ్డి, చెరుకూరి తిరుపతి రావు, పాలపాటి రవికుమార్, గంగాధర్, పద్మనాభం, దుర్గ భవాని, నాగమల్లేశ్వరి, జంధ్యాల రామ లింగ శాస్త్రి, కారం శెట్టి సత్యం, స్టాలిన్, సాంబమూర్తి, కృష్ణ చైతన్య,షేక్ బిలాల్, రామకృష్ణ, గురుదత్తు, నాగిరెడ్డి, ఉడతా నర్సింహా రావు, స్రవంతి, రావుల రాజశేఖర్, బ్రిజేష్, సురేష్ జైన్, పవన్, మనోజ్, బాబురావు,వెంకట రమణ, పలకలూరి శ్రీను, సురేష్ తదితరులు పాల్గొన్నారు.