Mahanaadu-Logo-PNG-Large

రుణమాఫీ వాట్సాప్ హెల్ప్ లైన్ పరిశీలించిన హరీష్‌రావు

– 8374852619 నెంబర్ కి వచ్చిన దరఖాస్తులు సుమారు 72,000

హైదరాబాద్ : రుణమాఫీ అందని రైతుల కోసం బిఆర్ఎస్ పార్టీ ఆఫీసులో వాట్సాప్ హెల్ప్ లైన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. వాట్సాప్ హెల్ప్ లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులను బిఆర్ఎస్ పార్టీ ఆఫీసు, తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి , ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు పరిశీలించారు. 8374852619 నెంబర్ కి వాట్సాప్ ద్వారా వచ్చిన దరఖాస్తులు సుమారు 72,000 పై చిలుకు ఉన్నాయని హరీష్ రావు వెల్లడించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ , తెలంగాణ భవన్ ఇంచార్జ్ మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.