టాస్క్‌ఫోర్స్ దాడిలో నలుగురు స్మగ్లర్ల అరెస్టు
రెండు వాహనాలు, సెల్‌ఫోన్ల స్వాధీనం
రాపూరు, మహానాడు : నెల్లూరు జిల్లా పెంచలకోన సమీపంలోని రాపూరు దగ్గర 16 ఎర్రచందనం దుంగలతో పాటు ఒక టెంపో ట్రావెలర్, మరో కారును టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. టాస్క్ ఫోర్స్ ఎస్పీ పి.శ్రీనివాస్ ఆదేశాల మేరకు డీఎస్పీ చెంచుబాబు అధ్వర్యంలో ఆర్‌ఐ (రిజర్వు) కె.సురేష్‌కుమార్‌రెడ్డికి చెందిన ఆర్‌ఎస్‌ఐలు కె.ఎస్.లింగాధర్, కె.సురేష్‌బాబు బృందాలుగా శుక్రవారం సాయంత్రం తిరుపతి నుంచి రాపూరు వరకు లోడిరగ్, డంపింగ్ పాయింట్లను తనిఖీ చేస్తూ వెళ్లారు. రాపూరు నుంచి ఎగువపల్లి అటవీ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున రెండు వాహనాలు అనుమానాస్పదం గా కనిపించడంతో అక్కడకు చేరుకున్నారు.
వాహనాల్లో ఎర్రచందనం దుంగలు లోడ్ చేస్తుండంతో వారిని చుట్టుముట్టారు. వారిలో కొందరు పారిపోగా నలుగు రు పట్టుబడ్డారు. వారిని తమిళనాడు తిరువన్నామలైకు చెందిన అన్బళగన్ (41), చిత్తూరు టౌన్‌కు చెందిన అసిఫ్ బాషా (21), ముత్తు (33), సెల్వం (30)లుగా గుర్తించారు. వీరి నుంచి 16 ఎర్రచందనం దుంగలు, ఒక టెంపో ట్రావెలర్, కారు, మూడు ఫాస్టాగ్‌లు, మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నా రు. వీరిపై తిరుపతి టాస్క్‌ఫోర్స్ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ రఫీ కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఎర్రచందనం దుంగల విలువ రూ.40 లక్షలు ఉంటుందని అంచనా వేసినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. ఆపరేషన్‌లో పాల్గొ న్న సిబ్బందికి రివార్డులు కోసం సిఫారసు చేసినట్లు చెప్పారు.