పవన్ కళ్యాణ్ కు హర్యానా ప్రభుత్వ ప్రాచీన జ్ఞాపికలు

హర్యానా రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైనీ నేడు ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ డీప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హర్యానా ప్రభుత్వం అందజేసిన వేలాది సంవత్సరాల పురాతనమైన సింధు నాగరికతకు సంబంధించిన ఆకృతులు, ఉమామహేశ్వర విగ్రహం, ఇతర ప్రాచీన జ్ఞాపికలను, వారి సత్కారాన్ని డిప్యూటీ సీఎం ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు.