దమ్మున్న అధికారికి పదవీ విరమణ శుభాకాంక్షలు
పోరాడిన ప్రభుత్వంతోనే పోస్టింగ్ ఇప్పించుకున్నారు
బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ
అమరావతి: జగన్ రెడ్డి చేసిన అన్యాయాన్ని ఎదిరించి చివరికి విజేతగా నిలిచి… అదే ప్రభుత్వం చేత పదవీ విరమణ రోజునే పోస్టింగ్ ఇప్పించుకుని గర్వంగా రిటైర్ అవుతున్న దమ్మున్న పోలీసు ఉన్నతాధికారి ఏబీ వెంకటేశ్వరరావు అని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ ప్రశంసించారు. శుక్రవారం సంఘం సమావేశంలో మాట్లాడుతూ ఆయన జగన్ రెడ్డి ప్రభుత్వంపై ఐదేళ్ల అలుపెరగని పోరాటం చేశారని, ఆంధ్రప్రదేశ్ పోలీసులు, ఐఏఎస్ అధికా రులు ఏబీ వెంకటేశ్వరరావుని రోల్ మోడల్‌గా తీసుకుంటే సమాజంలో గర్వంగా తలెత్తుకుని నిలబడగలరని తెలిపారు. లేదంటే అవమాన భారంతో తల వంచి కుమిలిపోతూ ఉండాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు. కూటమి ప్రభుత్వంలో ఆయనకు హోంశాఖ ముఖ్య సలహాదారుగా ఉన్నతమైన పదవిని ఇవ్వాలని డిమాండ్ చేశారు.