ముంబయి: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన కస్టమర్ లకు షాకిచ్చింది.. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్ట్ లెండింగ్ రేటు(ఎంసీఎల్‌ఆర్) పెంచుతున్నట్టు ఆ బ్యాంక్ సోమవారం ప్రకటించింది. సవరించిన లోన్ వడ్డీ రేట్లు ఈనెల ఏడోతేదీ నుంచే అమలు లోకి వస్తాయని తెలిపింది. ఆరు నెలల టెన్యూర్ ఎంసీఎల్ఆర్ రేటును, మూడేళ్ల టెన్యూర్ ఎంసీఎల్ఆర్ రేటును అయిదు బేసిస్ పాయింట్ల మేర పెంచినట్టు వెల్లడించింది. మిగితా టెన్యూర్ ఎంసీఎల్ఆర్ రేటును యథాతథం గానే కొనసాగిస్తున్నట్టు ఒక ప్రకటనలో పేర్కొంది.