– అక్రమ అరెస్టులతో జగన్ రెడ్డి, నన్ను అడ్డుకోలేడు
• చిలకలూరిపేటలో గెలవబోతున్నాననే జగన్ నా కుమారుడిపై తప్పుడు కేసులు పెట్టించి జైలుకు పంపాడు.
– మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
తప్పుడు కేసులతో ప్రతిపక్షనేతల్ని తొక్కేయాలన్న దుర్మార్గపు ఆలోచనల్లో భాగంగానే నా కుమారుడు శరత్ ను అర్థరాత్రి అదుపులోకి తీసుకున్నారని, విధ్వంసం…విద్వేషాల కలయికగా మారిన వైసీపీ పాలనలో అక్రమ కేసులతో గిట్టనివారిపై కక్షసాధింపులకు పాల్పడుతున్న జగన్ రెడ్డి.. ముందు శరత్ చేసిన తప్పేమిటో చెప్పాలని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రశ్నించారు.
మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం ఆయన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, టీడీపీ నేతలు వేమూరి ఆనంద్ సూర్య, అంగర రామ్మోహన్ రావులతో కలిసి విలేకరులతో మాట్లాడారు.ఆ వివరాలు వారి మాటల్లోనే …చంద్రబాబు నాకు టిక్కెట్ ప్రకటించిన 24 గంటల్లోనే నా కుమారుడు సహా…కుటుంబసభ్యులందరిపై తప్పుడు కేసులు పెట్టారు. ఏపీ స్టేట్ డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ విభాగం ఎవరి అధీనంలో పనిచేస్తోందో ముఖ్యమంత్రి చెప్పాలి. జగన్ రెడ్డి ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదానికి DRI వ్యవహరిస్తున్న తీరే నిదర్శనం. నాకు సీటు ప్రకటించిన 24 గంటల్లో కేసు పెట్టడం… నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయడం చేశారు. అర్థరాత్రి ఎక్కడెక్కడో తిప్పి, ఎప్పుడో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ఇలాంటి పనులు జగన్ రెడ్డికి బాగా అలవాటే కదా! తెలుగుదే శం పార్టీలో బలమైన నాయకుల్ని దెబ్బతీయాలన్న ఆలోచన తప్ప, జగన్ రెడ్డికి మరేమీ పట్టడం లేదు. ఎదుటివారిపై పెట్టే తప్పుడుకేసులతో తనకు నష్టం జరు గుతుందని తెలిసినా జగన్ రెడ్డి ఆగడు. తోడబుట్టిన చెల్లిని, బాబాయ్ కూతురినే వేధిస్తున్న వ్యక్తి సామాన్యుల్ని.. ప్రతిపక్ష నేతల్ని వదిలేస్తాడా? పోలీసులు నా కుమారుడును 16 గంటలపాటు 6 స్లేషన్లు తిప్పారు. ఎక్కడ ఎవరిని అడిగినా మాకుతెలియదు.. సీఎం కార్యాలయం నుంచి ఆదేశాలు రావాలనే చెప్పారు.” అని పుల్లారావు తెలిపారు.
ప్రజల్లో తనకు.. తన పార్టీకి ఎదురుగాలి వీస్తోందనే జగన్ ఇలాంటి కుట్ర రాజకీయాలకు పాల్పడుడుతున్నాడు : కొల్లు రవీంద్ర
పుల్లారావు కుమారుడు శరత్.. ఆయన కుటుంబసభ్యులపై DRI విభాగంతో అక్రమ కేసులు పెట్టించి, రాత్రి ఎప్పటికో మాచవరం పోలీస్ స్టేషన్లో సెక్షన్ 409, 461, 420లు నమోదు చేయించి, న్యాయమూర్తితో శరత్ కు రిమాండ్ వేయిం చారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. తెలుగువరంతా ఈ ప్రభుత్వ తీరుని, ముఖ్యమంత్రి కక్షసాధింపుల్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. తనకు… తన ప్రభుత్వా నికి ప్రజల్లో ఎదురుగాలి వీస్తోందనే జగన్ రెడ్డి ఇలాంటి చర్యలకు సిద్ధమయ్యాడు. తాడేపల్లిగూడెం సభ విజయవంతంపై రాష్ట్రమంతా చర్చ జరుగుతున్న తరుణం లో జగన్ రెడ్డి ఇలాంటి కుట్ర రాజకీయాలకు తెరతీశాడు. జగన్ రెడ్డి తప్పుడు కేసులతో ఎన్ని ఇబ్బందులు పెట్టినా వెనకడుగు వేయం.
మొన్నటివరకు సీఐడీ…ఇప్పుడు DRI.. శరత్ కు న్యాయస్థానాల్లో న్యాయం జరుగుతుంది
తండ్రి అధికారం అడ్డుపెట్టుకొని సూట్ కేసు కంపెనీలు పెట్టి, లక్షలకోట్లు దోచేసిన జగన్ రెడ్డి.. తనలాగే యువపారిశ్రామికవేత్తలు కూడా తప్పుడు మార్గంలో సంపా దిస్తారని జగన్ అనుకుంటున్నాడు. శరత్ కు న్యాయస్థానాల్లో కచ్చితంగా న్యాయం జరుగుతుంది.
తప్పుడు కేసులతో ప్రతిపక్షాల్ని లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు : మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు
జగన్ రెడ్డికి ప్రజాస్వామ్యంపై.. ప్రజలపై నమ్మకం లేదు. అందుకే తప్పుడు కేసులతో ప్రతిపక్షాల్ని దెబ్బతీయడానికి తన మాట వినే సంస్థల్ని వాడుకుంటు న్నాడు. టీడీపీ-జనసేన పొత్తుని ప్రజలు ఆమోదించారు. తాడేపల్లిగూడెం సభ విజయవంతం కావడంతో జగన్ సహా వైసీపీనేతలకు ప్యాంట్లు తడుస్తున్నాయి. చెల్లి కొడుకు.. సొంత మేనల్లుడినే దీవించలేని జగన్ .. విద్యార్థులకు మేనమామ అవుతాడా?” అని అంగర ప్రశ్నించారు