ఈయనకి ఎంతసేపూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ఆలోచన తప్ప, అధికారంలోకి వచ్చాం కదా ఇక రెచ్చిపోయి సైకో జగన్ లాగా లక్షల కోట్లు దోచుకుందాం అని కానీ… చుట్టూ ఒక ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్మించుకుందాం అని కానీ… ఊరికొక ప్యాలెస్ కట్టుకుందాం అని కానీ… ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టిన వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకుందాం అని కానీ ఉండవు.
ఈ ఫొటోలో పక్కనున్న అతను నిన్న చెప్పాడుగా.. సెల్ సిగ్నల్, పిన్ కోడ్ కూడా లేని చోట 10వేల పెట్టుబడితో ప్రారంభించిన మెడికల్ పార్క్, నేడు 145 కంపెనీలతో 10వేల కోట్ల టర్న్ ఓవర్ తో వరల్డ్ లార్జెస్ట్ మెడికల్ పార్క్ అయింది అని… ఈయనకి అది చాలు.వాటిని చూసి మురిసి పోతాడు, వాటి గురించి వచ్చే పొగడ్తలు విని పొంగిపోతాడు.
ఇటువంటి వాటి కోసమే గెలిచినప్పటి నుండి ఒక సీఎం లాగా కాకుండా.. రోజువారీ కూలీలాగా, కర్మాగారంలో పని చేసే కార్మికుడిలాగా, నెల జీతానికి పని చేసే ఉద్యోగి లాగా.. రోజూ 18గంటలు కష్టపడి పని చేస్తాడు. ఈయనంతే, మారడు… అందుకే అభిమానులకి కూడా పెద్దగా నచ్చడు..
– రవీంద్ర తీగల