– ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు
విజయవాడ, మహానాడు: స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల్లో ప్రజలంతా భాగస్వామ్యులు కావాలని సెంట్రల్ నియోజకవర్గ శాసన సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. అజిత్ సింగ్ నగర్ బసవ పున్నయ్య మునిసిపల్ స్టేడియంలో మంగళవారం స్వచ్ఛతా హి సేవా కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించి, మాట్లాడారు. అక్టోబర్ 2 నగరంలో స్వచ్ఛతా హీ సేవా- 2024 కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.
స్వచ్ఛతే సేవ అంటే మన పరిసరాలను శుభ్రంగా ఉంచడానికి చేసే సేవ. ఇది మనందరి బాధ్యత. పరిసరాలు శుభ్రంగా ఉంటే మన ఆరోగ్యం మెరుగుపడుతుంది.. వ్యాధులు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా, ఒక అందమైన పరిసరాల్లో నివసించడం మానసికంగా కూడా ఆనందాన్ని ఇస్తుందన్నారు. పర్యావరణం పరిసరాలను శుభ్రంగా ఉంచడం వల్ల కాలుష్యం లేకుండా ఉంటుందని, ఇది సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. చెత్తను నిర్ణీత స్థానాల్లో వేయాలి అని, ప్లాస్టిక్‌ను తగ్గించడం ప్లాస్టిక్ బ్యాగ్‌లకు బదులు కాగితపు సంచులను ఉపయోగించాలని, మొక్కలు నాటి, పచ్చదనం పెంచడానికి కృషి చేయాలని, నీటిని వృథా చేయకుండా ఉండటం, నీటిని మితంగా వాడాలని కోరారు. వివిధ పాఠశాలల, కళాశాలల విద్యార్థులు, స్వచ్ఛ కార్పొరేషన్ ఎండి గంధం చంద్రుడు, నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, తదితరులు హాజరయ్యారు.