గుడివాడ గుట్కా గాడు ఎప్పుడూ చూడలే..
మాజీ మంత్రి దేవినేని ఉమ
విజయవాడ, మహానాడు : గోదావరి నీళ్ళను కృష్ణమ్మలో కలిపితే చెంబుతో పోశారన్నారు.. పంపులు పీకుతాను అన్నవాడు పార్టీ పీకే పరిస్థితికి వచ్చాడని, గుడివాడ గుట్కా గాడు ఎప్పుడూ ఈ ప్రాంతాన్ని చూడలేదని గత పాలకులనుద్దేశించి మాజీ మంత్రి దేవినేని ఉమ ఎద్దేవా చేశారు. పట్టిసీమ నుంచి పవిత్ర సంగమం వద్ద గోదావరి జలాలు కృష్ణమ్మ చెంతకు చేరిన సందర్భంగా జల హారతి కార్యక్రమం ఇబ్రహీంపట్నం ఫెర్రీఘాట్ వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు, ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, మాజీ మంత్రి దేవినేని ఉమ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ…
దార్శనికుడు చంద్రబాబు నాయుడు ముందుచూపుతో పోలవరం పూర్తి అయ్యే లోపల గోదావరి తల్లి నీళ్లను పోలవరం రైట్ కెనాల్ ద్వారా ఈ ప్రాంతానికి.. లెఫ్ట్ కెనాల్ ద్వారా పురుషోత్తమ పట్టణానికి తీసుకొచ్చారన్నారు. 2015 మార్చి 29న చంద్రబాబు నాయుడు పట్టిసీమ శంకుస్థాపన చేశారు. సెప్టెంబర్ 15న ఆరు నెలలు పూర్తి అవ్వకుండా పవిత్ర సంగమం అని ఈ ప్రాంతానికి నామకరణం చేశారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 400 టీఎంసీలు నీళ్లు వచ్చాయి. ఒక సంవత్సరంలో 105 టీఎంసీల నీళ్లను తీసుకొచ్చాం. ఈ నీళ్లతో 35 సార్లు ప్రకాశం బ్యారేజ్ ని నింపవచ్చు.
పట్టిసీమ, పురుషోత్తపట్నం, పుష్కర, తాడిపూడి ఈ నాలుగు స్కీములను గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నారా చంద్రబాబునాయుడు ప్రారంభం చేసినవే. పట్టిసీమ నీళ్లతో తిరువూరు, గన్నవరం, నూజివీడు, మైలవరం మెట్ట ప్రాంతాలన్నీ కృష్ణ డెల్టా గోదావరి డెల్టాను తలపిస్తున్నాయి. చింతలపూడి ఎత్తిపోతల పథకానికి 4 వేల కోట్లకు పైగా ఖర్చుపెట్టాం. అది పూర్తయితే నందిగామ, మైలవరం, తిరువూరు, నూజివీడు, గన్నవరం, దెందులూరు, చింతలపూడి బెల్ట్ మొత్తం కూడా సస్యశ్యామలం అవుతుంది. ఆ స్కీముకు చంద్రబాబునాయుడు 2 వేల కోట్లు ఇవ్వాలనే పట్టుదలతో ఉన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవానికి లక్ష మంది వచ్చారు రేపు నీళ్లిచ్చే కార్యక్రమం పూర్తయితే లక్షలాదిమంది వస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి రామానాయుడు గారి సారథ్యంలో జల వనరుల శాఖ ఈ కార్యక్రమాలన్నీ పూర్తిచేస్తుందని ఆయన పేర్కొన్నారు.