తూర్పులో హ్యాట్రిక్‌ కొడతా..బాబుకు కానుక ఇస్తా

విజయవాడ తూర్పు టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్‌
పోలింగ్‌ బూత్‌లో కుటుంబసభ్యులతో ఓటు

విజయవాడ, మహానాడు : తూర్పు నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద మెజార్టీతో గెలిచి నారా చంద్రబాబు నాయుడుకు కానుకగా ఇస్తానని టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్‌ తెలిపారు. సోమవారం సాయంత్రం గుణదల పెద్ద బోర్డింగ్‌ స్కూలులో పోలింగ్‌ సరళిని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీ తనను అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుంచి తన విజయం కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసిన కూటమి నాయకులు, కార్యకర్తలు, తూర్పు నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని కృతజ్ఞత లు తెలియజేశారు. ఎన్నడూ లేని విధంగా తూర్పు నియోజకవర్గంలో 70 శాతానికి పైగా ఓటు హక్కు వినియోగించుకున్నారని వెల్లడిరచారు. అనంతరం చైతన్య టెక్నో స్కూలు లోని 295వ బూత్‌లో గద్దె అనురాధ, కుమారుడు గద్దె రాజేష్‌తో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.