నరసరావుపేట, మహానాడు : ప్రస్తుతం పల్నాడు జిల్లాలో పోలీసు ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది. ఎన్నికల అనంతరం జరిగిన ఘటనల నేపథ్యంలో పోలీసు శాఖ హై అలర్ట్ ప్రకటించింది. ఇప్పటికే గ్రామ గ్రామాన కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. అనుమా నిత వ్యక్తులను అదుపులోకి తీసుకుంటున్నారు. పలు గ్రామాల్లో మారణాయు ధాలపై గురిపెట్టారు. ఎట్టి పరిస్థితుల్లో కౌంటింగ్ ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు.