-సర్వేపల్లి ప్రజలకు అండగా ఉంటాం
-సోమిరెడ్డి కోడలు శృతిరెడ్డి
సర్వేపల్లి, మహానాడు: పొదలకూరు పట్టణంలో ఆరో రోజు నిర్వహించిన ఎన్నికల ప్రచారం సందర్భంగా సోమవారం మీడియాతో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కోడలు శృతిరెడ్డి మాట్లాడారు. వరదాపురం, ప్రభగి రిపట్నం, మరుపూరు, మొగళ్లూరులో వైట్ క్వార్ట్జ్ మైనింగ్ జరగలేదా..వేల కోట్లు కొల్లగొట్ట లేదా కాకాణి అంటూ ప్రశ్నించారు. సోమిరెడ్డి కుటుంబం ఐదేళ్లు సర్వేపల్లిలో అందుబాటులో లేదంటున్నారు. మా మామయ్య ప్రజలకు అండగా నిలిచి పోరాటం చేయకపోతే గూగూల్ మ్యాప్‌లో సర్వేపల్లి నియోజకవర్గమే మాయమైపోయి ఉండేది.
కాకాణి గోవర్ధన్ రెడ్డి సొంతూరు తోడేరులోనూ ఇష్టారాజ్యంగా మైనింగ్ చేశారు. గ్రావెల్, మట్టి తవ్వకాలతో చెరువుల్లో ఏర్పడిన గుంతల కారణంగా తోడేరుకు చెందిన ఏడుగురు యువకులు ప్రాణాలు కోల్పోయిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. విరువూరు రీచ్ నుంచి ఇసుక అక్రమ రవాణా జరగలేదం టారా. ఆ ఇసుకతోనే కరోనా ప్యాలెస్‌కు పోటీగా పొదలకూరులో వైసీపీ నేత ఇల్లు నిర్మాణం చేపట్టలేదంటారా అని నిలదీశారు. ఏ వీధికి వెళ్లినా ప్రతి పదిళ్లలో ఏడిరటిలో కాకాణి బాధితులున్నారు.
దళిత సోదరుడు ఉదయగిరి నారాయణను పొదలకూరు పోలీసుస్టేషన్‌లో చంపేసి చెట్టుకు వేలాడదీసిన విషయం అబద్ధమంటారా అని ప్రశ్నించారు. రోడ్ల పక్కన కూరగాయలు అమ్ముకునే చిరు వ్యాపారులపైనా ప్రతాపం చూపించారు. కాకాణి అండ్ బ్యాచ్ అరాచకాలతో కష్టాలు పడిన, నష్టపోయిన ప్రతి బాధిత కుటుంబానికి మేం అండగా ఉంటాం..న్యాయం చేస్తామని చెప్పారు. అవసరమైతే జాతీయ మహిళ కమిషన్, మానవ హక్కుల కమిషన్, జాతీ య ఎస్సీ కమిషన్‌ను ఆశ్రయించేందుకు కూడా వెనుకాడమని చెప్పారు.