విజయవాడ, ఆగస్టు 12: చియాన్ విక్రమ్ నటించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘తంగలాన్’ ప్రెస్ మీట్ విజయవాడలోని ఒక హోటల్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు, మీడియా ప్రతినిధులు హాజరయ్యారు.
విక్రమ్ మాట్లాడుతూ, “విజయవాడకు రావడం నాకు ఎప్పుడూ ప్రత్యేకమే. విజయవాడ వచ్చి ఫస్ట్ బాబాయ్ హోటల్‌లో టిఫిన్ చేశాను. అద్భుతంగా ఉంది. ఆగస్టు 15న ‘తంగలాన్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని ఐదు భాషల్లో విడుదల చేస్తున్నాం. ఈ చిత్రంలో నేను ఒక కొత్త క్యారెక్టర్‌లో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. దర్శకుడు పా.రంజిత్ ఈ చిత్రాన్ని ఎంతో కష్టపడి తీశారు. చిత్రంలోని ప్రతి సన్నివేశం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తెలుగు ప్రేక్షకులు నా సినిమాలను ఎంతగానో ఆదరించారు. ‘శివ పుత్రుడు’, ‘అపరిచితుడు’, ‘ఐ’, ‘నాన్న’ చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. ‘తంగలాన్’ చిత్రాన్ని కూడా తెలుగు ప్రేక్షకులు ఆదరించాలని కోరుతున్నాను. ‘తంగలాన్’ ఒక ఎమోషనల్ మూవీ. కుటుంబ సమేతంగా ఈ చిత్రాన్ని వీక్షించవచ్చు” అని అన్నారు.
హీరోయిన్ మాళవిక మోహనన్ మాట్లాడుతూ, “ఈ చిత్రంలో నేను ఒక కొత్త క్యారెక్టర్‌లో కనిపిస్తాను. ఫైట్స్ చేయడం కోసం కొన్ని రోజుల తరబడి ప్రాక్టీస్ చేశాను” అని తెలిపారు.
లండన్ నుంచి వచ్చిన డేనియల్ ఈ చిత్రంలో ఒక పవర్ఫుల్ విలన్ పాత్రలో కనిపిస్తున్నారు. డేనియల్ మాట్లాడుతూ, “నా నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాను. ప్రతి సన్నివేశాన్ని సింగిల్ షాట్‌లో చేశాము” అని అన్నారు.
Media error: Format(s) not supported or source(s) not found
Download File: https://mahanaadu.com/wp-content/uploads/2024/08/vikram.mp4?_=1