పట్టుదలతో ఉన్నత లక్ష్యాలు చేరుకోవాలి

విద్యతోనే జీవితానికి వెలుగు
పదవ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ కిట్స్ పంపిణీ చేసి ఆల్ ది బెస్ట్ తెలిపిన
మాజీమంత్రి కన్నా లక్ష్మీ నారాయణ

సత్తెనపల్లి : కొర్రపాటి పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం సత్తెనపల్లి పట్టణంలోని కస్తూరిబా గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ విచ్చేసి పదవ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ కిట్స్ – స్టడీ మెటీరియల్ అందజేశారు. పట్టుదలతో చదువుకుని ఉన్నత లక్ష్యాలు చేరుకోవాలని, విద్యతోనే జీవితానికి వెలుగు అని మంచి ఉత్తీర్ణత శాతం సాధించిన విద్యార్థులకు ఉన్నత విద్యకు ప్రోత్సాహకాలు అందజేస్తామని తెలిపారు.

కార్యక్రమంలో కొర్రపాటి పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కొర్రపాటి సురేష్, టిడిపి సత్తెనపల్లి మండల అధ్యక్షులు ఆళ్ళ అమరేశ్వర రావు,కట్టా రమేష్, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ పూజల వెంకటకోటయ్య, పల్నాడు జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు గుంటూరు ఆశీర్వాదం, జిల్లా అధికార ప్రతినిధి దివ్వెల శ్రీనివాసరావు, నియోజకవర్గ అధ్యక్షులు బొక్కా సంగీతరావు, బండారు నాగరాజు,పురం సుందరరావు, మట్టపల్లి అచ్యుతరావు న్యాయవాదులు పాల్గొని విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ తెలిపారు.