మూడేళ్ల బాలికపై అత్యాచారం, హత్య ఘటనపై హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి

  • ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే నిందితులని అరెస్ట్ చేయడం పోలీసుల పనితీరుకు నిదర్శనం :హోంమంత్రి
  • బాలిక కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని వెల్లడి

తిరుపతి జిల్లా వడమాలపేట మండలం ఏఎం పేట ఎస్టీ కాలనీలో మూడేళ్ల బాలికపై అత్యాచారం, హత్య ఘటనపై హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అభం శుభం తెలియని చిన్నారికి చాక్లెట్లు ఆశ చూపి దారుణానికి పాల్పడడం హేయమన్నారు. ఘటనకు పాల్పడిన నిందితుడ్ని కొన్ని గంటల వ్యవధిలోనే అరెస్టు చేయడం పోలీసుల పనితీరుకు నిదర్శనం అన్నారు మృతి చెందిన బాలిక కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ఈ సంఘటనపై సత్వరమే విచారణ జరిపి నిందితులకి శిక్ష పడేలా చేస్తామని హోం మంత్రి అనిత భరోసా ఇచ్చారు.