రాష్ట్ర హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వంగలపూడి అనితను మర్యాదపూర్వకంగా కలిసి అభినందించేందుకు ఆమె ఛాంబర్ కు వెళ్లిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్యను చూసిన హోంమంత్రి ఆయన పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా వారిద్దరు రాష్ట్రంలో శాంతి భద్రతలపై చర్చించారు. మాజీ పోలీస్ అఫీసర్ గా వర్లరామయ్య ఆమెకు పలు కీలక సూచనలు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోనే కీలకమైన శాఖగా ఉన్న హోమంత్రి పదవిని దళిత ఎస్సీ మహిళకు ఇవ్వడం గర్వకారణంగా ఉందని వర్ల రామయ్య అన్నారు. దళితులకు చంద్రబాబు పెద్ద పీట వేశారన్నారు. చంద్రబాబు అప్పగించన గురతర బాధ్యతను సక్రమంగా పాటిస్తూ.. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపడటంలో.. ఎస్సీలపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో కీలక పాత్రను పోసించాలని హోంమంత్రికి సూచించారు. డ్రగ్స్, గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపాలన్నారు. మహిళలపై దాడులను అరికట్టాలన్నారు. గుండాలు, రౌడీల పీచమనచాలన్నారు. దీనికి ఆమె సానుకూలంగా స్పందించి సీఎం చంద్రబాబు తనపై నమ్మకంతో అప్పగించిన హోం మంత్రి పదవికి ఎటువంటి మచ్చరాకుండా, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు పూర్తిగా కట్టుబడి పనిచేస్తానని ఆమె తెలియజేశారు.
రాజధాని మహిళారైతులను అభినందించిన వర్ల రామయ్య
హోంమంత్రి ఛాంబర్ నుండి బయటకు వస్తొన్న టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్యను రాజధాని మహిళా రైతులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాజధానికోసం వారు చేసిన అలుపెరగని పోరాటాలను గుర్తు చేస్తూ మహిళా రైతులను వర్ల రామయ్య అభినందించి కొనియాడారు. రాజధానికై వారు చేసిన పోరాటాన్ని మెచ్చుకున్నారు. టీడీపీ గెలుపు లో రాజధాని మహిళా రైతుల పాత్ర కీలకమన్నారు. రాజధాని రైతుల అకుంటిత దీక్షను చంద్రబాబు ఎంతగానో మెచ్చుకున్నారన్నారు. రాజధాని రైతుల అలుపెరగని పోరాట ఫలితమే నేడు రాజధానిలో జరుగుతున్న పనులకు ప్రతిరూపమన్నారు. త్వరలోనే రాజధాని రైతుల ఆశలు, రాష్ట్ర ప్రజల ఆకాంక్షను నేరవేర్చేలా రాజధాని రూపుదిద్దుకుంటోందన్నారు. చంద్రబాబు కృషితో రాజధాని నిర్మాణంగా వేగంగా జరుగుతుందని తెలిపారు. మును ముందు దేశంలోనే గొప్పరాజధానుల్లో ఒకటిగా మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దేవతల రాజధాని అమరావతిలాగే అందరిని ఆకర్షించే రాజధానిగా ఏపీ రాజధాని అమరావతి మారబోతుందని వర్ల రామయ్య పేర్కొన్నారు.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముకేష్ కుమార్ మీనాను సత్కరించిన వర్ల రామయ్య, టీడీపీ నేతలు
రాష్ట్రంలో అరాచక మూకల పీచమనిచి ఎన్నికలు ప్రశాంత వాతావరంలో సజావుగా జరిగేలా సహకరించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముకేష్ కుమార్ మీనాను టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య నేతృత్వంలో ఆపార్టీ నేతలు మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగడానికి ముకేష్ కుమార్ మీనా చేసిన కృషి అద్భుతమన్నారు. ముకేష్ కుమార్ మీనాతో పాటు ఎన్నికలు ప్రశాంతంగా సహకరించిన అధికారులను చంద్రబాబు మెచ్చుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆయనకు దుశ్శాలువాతో సత్కరించి, సన్మానించారు. వర్ల రామయ్య మాట్లాడుతూ.. ఓటర్ వెరిఫికేషన్ లో పారదర్శకతతోపాటు.. ఎన్నికల నోటిఫికేషన్ దగ్గర నుండి ఎన్నికలు పూర్తై.. ఫలితాలు వచ్చే వరకు ఎటువంటి మేజర్ ఘటనలు చోటుచేసుకోకుండా.. దేశంలోనే అత్యధిక పోలింగ్ జరిగేలా చూడటంలో మీనాగారి కృషి ఎనలేనిదని కొనియాడారు. ఇటువంటి అధికారులతోనే దేశంలో ప్రజాస్వామ్యం నిలబడుతుందని.. ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోగలుగుతున్నారన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలక భూమిక పోస్తున్న ఇవంటి అధికారులు అందరికి ఆదర్శమని వర్లరామయ్య కొనియాడారు.