Mahanaadu-Logo-PNG-Large

హోమ్‌ ఓటింగ్‌లో అంబటి అనుచరుల వీరంగం

వైసీపీకే ఓటు వేయాలని వయోవృద్ధుడికి బెదిరింపులు
లేదంటే బయటకు లాగి తంతామని హెచ్చరికలు
అధికారుల బృందం కళ్లెదుటే దౌర్జన్యం
ప్రశ్నించిన టీడీపీ కార్యకర్తలపై మారణాయుధాలతో దాడి
ఐదుగురికి గాయాలు..ఇద్దరి పరిస్థితి విషమం
ముప్పాళ్ల మండలం మాదలలో ఘటన

సత్తెనపల్లి: పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలంలోని మాదల గ్రామంలో అంబటి రాంబాబు అనుచరులు, వైసీపీ కార్యకర్తలు బరి తెగించారు. హోమ్‌ ఓటింగ్‌ జరుగుతున్న ఇంట్లోకి చొరబడి ఓటు వేస్తున్న వయోవృద్ధుడిపై మీ ఇష్టం వచ్చినట్లు కాదు.. మేము చెప్పినట్లు ఓటు వేయాలంటూ అధికారుల బృందం ముందే దౌర్జన్యానికి దిగారు. ఈ అరాచకం ఏంటని ప్రశ్నించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై మారణాయుధాలతో దాడి చేశారు. రెడ్డి సామాజికవర్గం, ముస్లిం సామాజికవర్గం, వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఏకమై మూకుమ్మడిగా టీడీపీ మద్దతుదారుల ఇళ్లపైకి రాళ్లు వేశారు. పోలీసులు ఆపుతున్నా వారిని నెట్టుకుంటూ కర్రలు, రాళ్లు, మారణాయుధాలతో ఐదుగురు టీడీపీ మద్దతుదారులపై దాడి చేశారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. హోమ్‌ ఓటింగ్‌లో వైసీపీ నాయకుల దౌర్జన్యంపై టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు వివరించారు.

కన్నా లక్ష్మీనారాయణ పరామర్శ

అంబటి రాంబాబు అనుచరుల దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పరామర్శించారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వైసీపీ మూకల దాడిని ఖండిరచారు. ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను, ఎన్నికల కమిషన్‌ను కోరారు.