ట్విట్టర్‌లో మాజీమంత్రి హరీష్‌రావు
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆస్పత్రి క్యాంటీన్‌లకు రూ.20 కోట్ల బిల్లులు చెల్లించకపోవడంతో రోగులు, వైద్యులు తిండిలేక అవస్థలు పడుతున్నారని ట్విట్టర్‌లో మాజీమంత్రి హరీష్‌రావు ట్వీట్ చేశారు. ఈ నిర్లక్ష్యం, పెరుగుతున్న ఖర్చులతో కలిపి ప్రాణాలకు ముప్పు కలిగిస్తుంది. బకాయి బిల్లులు చెల్లించి రోగుల శ్రేయస్సును కాపాడేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.