టీటీడీలో అన్యమతస్తులకు ఎలా పదవులు ఇచ్చారు?

– జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోన బోయిన శ్రీనివాస్

గుంటూరు, మహానాడు: ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పవిత్రంగా భావించే ప్రసాదాన్ని వైసీపీ నాయకులు అపవిత్రం చేశారని, అసలు టీటీడీలో అన్యమతస్తులకు ఎలా పదవులు ఇచ్చారని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోన బోయిన శ్రీనివాస్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ఏమన్నారంటే.. వైసీపీ నాయకులు తప్పు చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. వైసీపీ చేసిన తప్పులకు మా నాయకుడు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు. గుంటూరు లో కూడా మేము కూడా తొమ్మిది రోజులు దీక్ష చేస్తున్నాం. 111 మందితో గోరంట్ల లో ఉన్న ఆలయంలో పూజలు నిర్వహించి దీక్ష చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేశారు అందుకే రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా పోయింది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న గాదె వెంకటేశ్వరరావు ఏమన్నారంటే… కూటమి ప్రభుత్వం పై నిందలు వేయడానికే వైసీపీ నాయకులు ఉన్నారు. వైసీపీ చేసే అసత్య ప్రచారాలు తిప్పికొట్టడానికే ‘ఇది మంచి ప్రభుత్వం’ అనే కార్యక్రమం చేస్తున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ప్రజలకు ఒక నమ్మకం. అక్కడ ఇచ్చే ప్రసాదం లడ్డు లో జంతువుల కొవ్వు వాడడం దురదృష్టకరం. ఎన్ డిడి ఇచ్చిన రిపోర్ట్ మేరకే గత ప్రభుత్వం లో లడ్డు లో కల్తీ జరిగింది అని చెప్తున్నాం. ప్రజాస్వామ్యంలో కూటమి ప్రభుత్వం మంచి చేయకుంటే ప్రజలు రోడ్డు పైకి వస్తారు. గడిచిన అయిదేళ్ళు జరిగిన అవినీతి పై ఆధారాలతో బయట పెడతాం.