బటన్‌ నొక్కి ఇచ్చింది ఎంత…నొక్కింది ఎంత?

మరో కబాలీలా జగన్‌ మారాడు
అసాంఘిక శక్తులకు అడ్డాగా పులివెందుల
కడప పార్లమెంటు కాంగ్రెస్‌కు కంచుకోట
20న షర్మిలారెడ్డి నామినేషన్‌
రాహుల్‌ను ప్రధానిగా చూడాలని వైఎస్సార్‌ ఆశయం
పీసీసీ మీడియా చైర్మన్‌ తులసిరెడ్డి

పులివెందుల, మహానాడు : పులివెందుల అసాంఘిక శక్తులకు అడ్డాగా మారిందని పీసీసీ మీడియా చైర్మన్‌ తులసిరెడ్డి వ్యాఖ్యానించారు. పులివెందుల పార్టీ కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పులివెందులలో రోడ్లు అధ్వానంగా మారాయి…భూలోకంలో యమలోకం చూస్తున్నామని విమర్శించారు. సీఎం జగన్‌ బటన్‌ నొక్కింది నిజమే…బటన్‌ నొక్కి ఇచ్చింది ఎంత…వసూలు చేసింది ఎంత? అని ప్రశ్నించారు. ఆయన మరో కబాలీలా తయారయ్యాడని ధ్వజమెత్తారు. బీజేపీకి దాసోహం అయ్యాడని, ఏపీలో బీజేపీ అంటే వైసీపీ అని తెలుసుకున్నారని అన్నారు. అందుకే ఇందిరమ్మ రాజ్యం రావాలి కాంగ్రెస్‌ గెలవాలి అని పిలుపునిచ్చారు. ఈ నెల 20న కడప కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థిగా షర్మిల నామినేషన్‌ దాఖలు చేస్తారని వెల్లడిరచారు. కడప పార్లమెంటు కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోట అని,
రాహుల్‌ గాంధీని ప్రధాని చేయాలన్నదే దివంగత వైఎస్‌అర్‌ అశయమని పేర్కొన్నారు. కేంద్రంలో కాంగ్రెస్‌ రావాలి… అందులో కడప గెలవాలన్నది లక్ష్యమన్నారు. రాష్టంలో కాంగ్రెస్‌…మ్యాజిక్‌ ఫిగర్‌ దాటుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.