– వైఎస్సార్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి
అమరావతి: ‘స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబు తప్పు చేశారనడానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిమెన్స్ కంపెనీ ఆస్తులు అటాచ్ చేయడమే నిదర్శనం. చంద్రబాబు ప్రభుత్వ నిధులను సిమెన్స్ కంపెనీ ద్వారా తన షెల్ కంపెనీలకు తరలించారనే అంశంపై విచారణ జరుగుతోంది. దీనిపై చంద్రబాబు అండ్ కో ప్రజల దృష్టి మరల్చేందుకు ఈడీ క్లీన్ చిట్ ఇచ్చినట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఓ వైపు ఈడీ ఆస్తుల అటాచ్మెంట్ చేస్తే చంద్రబాబుకు క్లీన్ చిట్ అని ఎలా ప్రచారం చేస్తారు? ఇంతకన్నా బరితెగింపు ఉంటుందా? తప్పుడు ప్రచారం చేసి ప్రజలను నమ్మించగలరేమోగానీ కోర్టును నమ్మించలేరు’