– మీ పోలీస్ పటేల్ అహంకారానికి నిదర్శనమా ?
– ఓ వైపు డా.బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్,ఆ పక్కన దూక్సిచిలా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం,ఎదురుగా అమరజ్యోతి
– ఇప్పుడు మధ్యలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడం ద్వారా తెలంగాణ ఆత్మ లింక్ ను రేవంత్ రెడ్డి కట్ చేశారు
– తెలంగాణ భవన్ లో సోమవారం నాడు మాజీ మంత్రి,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి,బీ ఆర్ ఎస్ నేతలు సోమ భరత్ కుమార్, రాకేష్ కుమార్
హైదరాబాద్; తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతీక లైన డా.బి.ఆర్ అంబెడ్కర్ తెలంగాణ సెక్రటేరియట్ మరియు తెలంగాణ అమరుల స్ఫూర్తికి ప్రతీకలైన అమరుల జ్యోతి కట్టడాల మధ్యలో తెలంగాణ కు సంబందమే లేని ఒక పార్టీకి చెందిన వ్యక్తి రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టడం చాలా శోచనీయం.బాధాకరం. సిగ్గుమాలిన చర్య.
తెలంగాణ తల్లి ఉండాల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం అంటే…తెలంగాణ తల్లిని అవమానించైనా సరే, ఢిల్లీ బాస్ లు సోనియాగాంధీ మెప్పు పొందాలనే ఆతృత రేవంత్ రెడ్డి ది.
తెలంగాణ మేధావులు,కవులు, కళాకారులు వద్దన్నా వినకుండా కేవలం తన ఢిల్లీ బాసులను ప్రసన్నం చేసుకోవడానికి తెలంగాణ ఆత్మను తాకట్టు పెట్టాడు రేవంత్ రెడ్డి.తెలంగాణ ఆత్మను గౌరవించే కేసీఆర్ ఆనాడే జూన్,జులై 2023 లోనే ఈ స్థలంలో తెలంగాణ తల్లిని నిలబెట్టాలని ప్లాన్ చేసాడు.ప్రాంతమంతా చదును చేసి..చుట్టూతా రోడ్లను వెడల్పు చేసి…ఈ స్థలానికి బేస్మెంట్ కూడా కట్టారు.
తెలంగాణ తల్లి విగ్రహంతో పాటుగా ఒక ప్లాజాను ఏర్పాటు చేయాలని కేసీఆర్ భావించారు. పోలీస్ స్టేషన్,ఫుడ్ కోర్ట్స్,బస్ స్టాప్ కట్టాలని కేసీఆర్ అనుకున్నారు.
ఏం సందర్భం ఉందని రేవంత్ రెడ్డి తెలంగాణ ఆత్మను తాకట్టు పెట్టి ఇక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతున్నాడు? అమరజ్యోతి సందర్శనకు ప్రజల అనుమతి ఇవ్వాలి.
ప్రపంచంలో ఇలాంటి నిర్మాణాలు మూడే ఉన్నాయి.ఒకటి చికాగో బీన్, రెండు దుబాయ్ మ్యూజియం మూడు అమరవీరుల జ్యోతి. కేసీఆర్ ఆనవాళ్లను చేరిపివేయాలని రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్ కట్టిన సెక్రటేరియట్, కమాండ్ కంట్రోల్ రూమ్ లో మాత్రం రేవంత్ రెడ్డి కూర్చుంటున్నారు.రేవంత్ రెడ్డి బేషజాలకు పోకుండా ఒకసారి అమరులవీరుల జ్యోతిని సందర్శించండి.ఆ ప్రాంగణం లోపలికి వెళితే మీ మనసు మారుతుంది.
ప్రారంభించి సంవత్సరం దాటిపోయింది.ఇప్పటికి రేవంత్ రెడ్డి దీన్ని వాడుకం లోకి తీసుకు రాలేదు. 125 అడుగుల డా.బి.ఆర్ .అంబేద్కర్ విగ్రహం సందర్శనకు ప్రజలకు అనుమతి ఇవ్వాలి. అంబేద్కర్ జయంతి రోజున మీరు అక్కడికెళ్లి నివాళులు అర్పించలే దు.
ప్రభుత్వం ఏర్పాట్లు చేయలేదు, చివరకు కనీసం పూలదండ కూడా ఏర్పాటు చేయలేదు.ప్రజలను అనుమతించలేదు. మీ పోలీస్ పటేల్ అహంకారానికి నిదర్శనమా ?రాహుల్ గాంధీ రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరుగుతారు..రేవంత్ రెడ్డేమో రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారిని అవమానిస్తారు.